ప్రస్తుతం అందరూ బంగారం, వెండి గురించి ఆలోచిస్తుంటే ధనవంతులు మాత్రం సైలెంట్ గా వేరే ఆస్తిపై ఫోకస్ పెట్టారు. బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఊహించని విధంగా ఉన్న ఈ సమయంలో.. పెట్టుబడుల్లో ఒక కొత్త నిర్ణయాత్మకమైన మార్పు జరుగుతోంది. అదే లగ్జరీ రియల్ ఎస్టేట్! ధనవంతులు, పెద్ద కుటుంబాలు, ఎన్నారైలు (NRIs) ఇప్పుడు ఈ కొత్తరకమైన ఇన్వెస్ట్ మెంట్ పై ఫోకస్ పెట్టారు. ఇదెలా ఉంటుందంటే..
బ్లూ-చిప్ అసెట్
ప్రపంచ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీలైన నైట్ ఫ్రాంక్ (Knight Frank) , CBRE ల నివేదిక ప్రకారం.. అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ఎన్క్లేవ్లు , ప్రీమియం గ్రేడ్ కమర్షియల్ స్థలాలు ఇప్పుడు భారతదేశంలో “కొత్త బ్లూ-చిప్ ఆస్తి వర్గం”గా ఉద్భవించాయి. సంపన్న వర్గాలు ఇప్పుడు అత్యంత ప్రత్యేకమైన ఈ మైక్రో-మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఆస్తుల లభ్యత చాలా తక్కువగా ఉంది. కానీ డిమాండ్ మాత్రం విపరీతంగా ఉంది.
టాప్ ప్లేసులు ఇవే..
ఈ బ్లూచిప్ అసెట్ లకు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఢిల్లీలోని లుటియన్స్ బంగళా జోన్ (Lutyens’ Bungalow Zone). ముంబైలోని సముద్రం వైపు ఉన్న ఖరీదైన ప్రాంతాలు. గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ వెంబడి ఉన్న స్కైలైన్. బెంగళూరులోని ఎంపిక చేసిన అధిక-విలువ ప్రాంతాలు. హైదరాబాద్ పరిసరాల్లో కొన్ని ప్రాంతాలు అపారమైన వృద్ధిని కోరుకునే వాళ్లు ఇలాంటి ప్లేసుల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ ఈ పెరుగుదలకు ప్రధాన కారణం నిర్మాణాత్మక అసమతుల్యత. అంటే సూపర్-ప్రైమ్ జోన్లలో కొత్త నిర్మాణాలకు స్థలం లేదు. భూమి బహిరంగ మార్కెట్లోకి రావడం చాలా అరుదు. ఈ దీర్ఘకాలిక సరఫరా కొరత ధరలను ఊహించని స్థాయికి పెంచుతోంది. దీని గురించి నిరాలా వరల్డ్ (Nirala World) CMD సురేష్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ కొత్త ఇన్వెంటరీ పరిమితంగా ఉన్నప్పటికీ అల్ట్రా-లగ్జరీ , టాప్-ఎండ్ కమర్షియల్ మార్కెట్లు స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపారు. “ఈ విభాగం కేవలం జీవనశైలి ఎంపిక స్థాయిని దాటింది. ఇది సంపదను కాపాడుకోవడానికి అత్యంత నమ్మకమైన యంత్రాంగంగా మారింది.” అని ఆయన అన్నారు. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు ఇవ్వలేని భద్రత , స్థిరత్వాన్ని ఇది అందిస్తుందట.
కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా..
కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా ఈ తరహా పెట్టుబడుల్లో ఉంది. వీటిలో అద్దె రాబడి (Rental Yields) 6-10% మధ్య ఉంది. ఇది ఈక్విటీ మార్కెట్ల రాబడి కంటే చాలా స్థిరంగా పరిగణించబడుతుంది. Grade A అభివృద్ధి ప్రాజెక్టులలో మల్టీ నేషనల్ కంపెనీలకు లీజుకిచ్చిన కార్యాలయాలు, అల్ట్రా-రిచ్ పీపుల్ కి దీర్ఘకాలిక నగదు యంత్రాలుగా (Long-term cash machines) మారుతున్నాయి. ఎక్సోటికా హౌసింగ్ (Exotica Housing) MD దినేష్ జైన్ ప్రకారం.. సూపర్-ప్రైమ్ ప్రాంతాలలో కొత్త అభివృద్ధి అవకాశాలు లేకపోవడం సహజంగానే ఇప్పటికే ఉన్న అధిక-స్థాయి వాణిజ్య ఆస్తుల విలువను పెంచుతుంది.
విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి
విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి విదేశీ పెట్టుబడిదారుల రికార్డు భాగస్వామ్యం కూడా ఈ మార్కెట్ బలానికి మరొక ముఖ్య కారణం. విదేశీ పెట్టుబడిదారులలో చాలా మందికి, భారతదేశంలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్.. అధిక రాబడి ఇస్తుందన్న నమ్మకం పెరిగింది. అలాగే ఇది తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడిగా విదేశీపెట్టుబడి దారులు చూస్తున్నారు.